Jagan: తలపాగా చుట్టి.. చాటలో ధాన్యాన్ని తూర్పారబట్టిన జగన్!

  • పశ్చిమగోదావరి జిల్లాలో ఈరోజు కొనసాగిన పాదయాత్ర
  • ముదునూరు శివారులో రైతులతో మమేకమైన జగన్
  • రైతుల యోగక్షేమాల గురించి తెలుసుకున్న అధినేత
వైసీపీ అధినేత జగన్ తన ప్రజా సంకల్పయాత్రలో భాగంగా రైతులతో ఈరోజు మమేకమయ్యారు. ఈరోజు ఉదయం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం శివారు నుంచి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైంది. బోడపాడు క్రాస్ మీదుగా ముదునూరు శివారు చేరుకున్న జగన్ అక్కడి రైతులతో మమేకమయ్యారు. రైతుల యోగక్షేమాలు విచారించారు.

అనంతరం, తలపాగా చుట్టుకుని, చాటలో ధాన్యాన్ని ఆయన తూర్పారబట్టడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. కాగా, తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో తన పాదయాత్ర ముగించుకుని ఉంగుటూరు చేరుకున్న ఆయనకు ఎమ్మెల్సీ ఆళ్ల నాని, నియోజకవర్గ కన్వీనర్ పుప్పాల వాసుబాబు, తదితరులు ఘనస్వాగతం పలికారు.  
Jagan
West Godavari District

More Telugu News