TTD: రమణ దీక్షితులు ఆరోపిస్తున్న నగల సంగతేంటి?: నేడు చంద్రబాబు వద్దకు టీటీడీ పంచాయితీ!

  • అర్చకుల పదవీ విరమణ నిర్ణయం తరువాత వివాదం
  • పలు సంచలన ఆరోపణలు చేసిన రమణ దీక్షితులు
  • నేడు చంద్రబాబుకు వివరణ ఇవ్వనున్న చైర్మన్, ఈవో

తిరుమలలో 65 సంవత్సరాలు దాటిన అర్చకులను ఇంటికి పంపించి వేయాలన్న సంచలన నిర్ణయాన్ని టీటీడీ అమలులోకి తెచ్చిన తరువాత నెలకొన్న వివాదంపై ఆగ్రహంతో ఉన్న చంద్రబాబు, నేడు ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ లతో సమావేశం కానున్నారు.

తిరుమలలో స్వామివారి నగలు కనిపించడం లేదని, విలువైన వజ్రాన్ని అధికారులు మాయం చేసి, తప్పుడు మాటలు చెబుతున్నారని మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు చేసిన విమర్శలపైనా చంద్రబాబు ఈ సమావేశంలో వివరణ కోరనున్నారని తెలుస్తోంది. ఆలయంలో జరుగుతున్న పూజా కైంకర్యాలు, నగల నిర్వహణ తదితర విషయాలపై భక్తుల్లో ఆందోళన కలుగకుండా చూసేందుకు తీసుకున్న చర్యలు, రమణ దీక్షితులు తొలగింపు తరువాత నెలకొన్న పరిణామాలను సీఎం చంద్రబాబుకు టీటీడీ చైర్మన్,ఈవోలు వివరించనున్నట్టు తెలుస్తోంది.

More Telugu News