జేడీఎస్‌తో కలవడం వల్ల చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయి: కర్ణాటక పీసీసీ చీఫ్

  • జేడీఎస్‌తో పొత్తు పెద్దల నిర్ణయం
  • దానికి కట్టుబడి ఉండాల్సిందే
  • మున్ముందు మాకు కష్టకాలమే
కర్ణాటకలో తాము జేడీఎస్‌తో పొత్తు పెట్టుకోవడం వల్ల కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయని ఆ పార్టీ కర్ణాటక చీఫ్ జి.పరమేశ్వర అన్నారు. రాష్ట్రంలో ఇక తమకు కష్టకాలం మొదలు కాబోతోందని వ్యాఖ్యానించారు. జేడీఎస్‌తో పొత్తు వల్ల చాలామంది బాధపడ్డారని, ఆ విషయాన్ని తాను అర్థం చేసుకోగలనని పేర్కొన్నారు. దక్షిణాదిన బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆ ఒక్క ఉద్దేశంతోనే జేడీఎస్‌కు మద్దతు ఇచ్చామని వివరించారు. పార్టీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయానికి అందరూ తలొగ్గాల్సిందేనని అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కష్టకాలం మొదలవుతుందని, సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు పోవాల్సి ఉంటుందని పరమేశ్వర వివరించారు.
Go Back to Shorts
Karnataka
JDS
Congress

More Telugu News