balakrishna: బాలయ్య - బోయపాటి కాంబో రెడీ అవుతోంది.. దగ్గర్లోనే ముహూర్తం!

  • వినాయక్ తో సెట్స్ పైకి బాలకృష్ణ 
  • ఎన్టీఆర్ బయోపిక్ కి సన్నాహాలు 
  • ఆ తరువాత మూవీ బోయపాటితో

బాలకృష్ణ కెరియర్లో చెప్పుకోదగినవిగా 'సింహా' .. 'లెజెండ్' చిత్రాలు నిలిచాయి. ఈ రెండు సినిమాలకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించాడు. అందువలన ఆయనకి బాలకృష్ణతో ఎంతో సాన్నిహిత్యం వుంది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా రూపొందనుందనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది.

 ఈ సినిమా పూజా కార్యక్రమాలను వచ్చేనెల మొదటివారంలో జరపాలనే నిర్ణయానికి బాలకృష్ణ .. బోయపాటి వచ్చినట్టుగా సమాచారం. ఎన్టీఆర్ బయోపిక్ .. బాలకృష్ణ సొంత బ్యానర్లో రూపొందనుందనే సంగతి తెలిసిందే. అదే బ్యానర్లో బోయపాటి సినిమా వుండనుందని అంటున్నారు. ప్రస్తుతం వినాయక్ తో కలిసి సెట్స్ పైకి వెళుతోన్న బాలకృష్ణ, ఆ తరువాత ఎన్టీఆర్ బయోపిక్ ను చేయనున్నాడు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తరువాత బోయపాటితో రెగ్యులర్ షూటింగుకి వెళ్లనున్నట్టు చెబుతున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.    

More Telugu News