kanna laxminarayana: జగన్ ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? అని అడగడానికే చంద్రబాబు ఢిల్లీ వెళ్లేవారు!: కన్నా లక్ష్మీనారాయణ

షార్ట్స్‌లో చూడండి
సీఎం చంద్రబాబునాయుడిపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఏపీ అభివృద్ధి గురించి మాట్లాడేందుకు బదులు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారని అడిగేందుకే చంద్రబాబు ఢిల్లీకి ఎక్కువగా వెళ్లారని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఈ విషయమై తనకు సమాచారం ఉందని అన్నారు.

‘జగన్ మోహన్ రెడ్డిని ఎప్పుడు అరెస్టు చేస్తారు.. ఏపీలో అసెంబ్లీ సీట్లను ఎప్పుడు పెంచుతారు? అనే అంశాలపైనే చంద్రబాబు ఫోకస్ ఎక్కువగా పెట్టారు. రాష్ట్రంపై చంద్రబాబు ఫోకస్ ఉన్నట్టయితే ఆయన అడిగింది ఎప్పుడూ కేంద్ర ప్రభుత్వం కాదనలేదు. ఇందుకు నిదర్శనం స్పెషల్ ప్యాకేజ్ ప్రకటించిన రోజున..దానికి కేబినెట్ అంగీకారం కావాలంటే వెంటనే ఇచ్చారు. ఎక్సటర్నల్ ఏజెన్సీలతో టై అప్ ఇచ్చారు..’ అని చెప్పుకొచ్చారు. ‘ఒకపక్క జగన్మోహన్ రెడ్డి, మరోవైపు పవన్ కల్యాణ్ ని చూసి చంద్రబాబు భయపడ్డారు. అందుకే, యూ టర్న్ తీసుకున్నారు. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి వాళ్ల (జగన్, పవన్) లైన్ లో ఈయన నిలబడ్డారు’ అని కన్నా విమర్శించారు.
Go Back to Shorts
kanna laxminarayana
Chandrababu

More Telugu News