Pawan Kalyan: నేను గెలుస్తానో లేదు తెలియదు కానీ, ప్రజలను మాత్రం మోసం చేయను: పవన్ కల్యాణ్

  • అందరి అభివృద్ధి కోరుకునే పార్టీ జనసేన
  • ప్రజాసమస్యలపై పోరాడుతున్న మా కార్యకర్తలపై దాడి చేస్తే సహించం
  • టీడీపీ ప్రభుత్వం ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు
తాను గెలుస్తానో లేదు తెలియదు కానీ, ప్రజలను మాత్రం మోసం చేయనంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్  ప్రజలకు హామీ ఇచ్చారు. ఇచ్ఛాపురం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, అందరి అభివృద్ధి కోరుకునే పార్టీ జనసేన అని, ప్రజా సమస్యలపై పోరాడుతున్న తమ పార్టీ కార్యకర్తలపై దాడికి దిగితే సహించేది లేదని ఈ సందర్భంగా హెచ్చరించారు.

ఈ సందర్భంగా ప్రత్యేకహోదా అంశం గురించి పవన్ ప్రస్తావిస్తూ, చట్టసభల్లో చెప్పినవన్నీ త్రికరణశుద్ధిగా పాటిస్తారని తాను నమ్మానని, ఏళ్లు గడుస్తున్నాయి కానీ ‘హోదా’ హామీ నెరవేరడం లేదని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని మండిపడ్డ పవన్, అధికారంలో ఉండి ఒక్క వర్గానికో, కుటుంబానికో మేలు చేయకూడదని, ప్రజాస్వామ్యంలో అందరం సమానమని నమ్ముతానని అన్నారు.
Pawan Kalyan
ichapuram

More Telugu News