Pawan Kalyan: బీజేపీకి భయపడుతోన్నది నేను కాదు...చంద్రబాబే!: ‘జనసేన’ అధినేత పవన్ కల్యాణ్

  • సరికొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా
  • ఎవరో ఆడించే ఆట బొమ్మను కాదు.. భయపడే వ్యక్తిని కాదు
  • టీడీపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయింది
2019లో 175 స్థానాల్లో పోటీ చేస్తామని, సరికొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ‘జనసేన’ అధినేత పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఇచ్ఛాపురం బహిరంగం సభలో పవన్ మాట్లాడుతూ, తాను ఎవరో ఆడిస్తే ఆడే ఆట బొమ్మను కాదని,  భయపడే వ్యక్తిని అసలే కాదని అన్నారు. బీజేపీకి భయపడుతోంది తాను కాదని, సీఎం చంద్రబాబేనని, అసలు, ఆయన ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదని అన్నారు.

‘చంద్రబాబు భయపడటానికి కారణం..ఓటుకు నోటు..లోగుట్టు పెరుమాళ్ల కెరుక’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏపీని మోసం చేసిన బీజేపీని టీడీపీ నిలదీయలేకపోయిందని, టీడీపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. ప్రజాసమస్యల పోరాట క్షేత్రంలో ప్రతిపక్షం వైఫల్యం చెందిందని, ‘హోదా’సాధన కోసం ఇటీవల చంద్రబాబు చేపట్టిన నిరసన దీక్ష.. ధర్మపోరాట దీక్షపై ఆయన విమర్శలు గుప్పించారు. ‘ప్రజాక్షేత్రంలోకి వెళ్దాం. మీరో వైపు.. నేనో వైపు కూర్చుందాం..ప్రత్యేకహోదాపై ధర్మాపోరాటం ఎవరిదో ప్రజలే తేలుస్తారు’ అని పవన్ కల్యాణ్ అన్నారు.
Pawan Kalyan
ichapuram

More Telugu News