కర్ణాటక ఇక కాషాయమయం కావట్లేదు: ప్రకాశ్ రాజ్ స్పందన
- రంగురంగులుగానే ఉంటుంది
- ఆట మొదలు పెట్టకుండానే ముగిసింది
- నేను ప్రజల తరఫున నిలబడడాన్ని ఎప్పటికీ కొనసాగిస్తాను
తాను ప్రజల తరఫున నిలబడడాన్ని ఎప్పటికీ కొనసాగిస్తానని ప్రకాశ్ రాజ్ తెలిపారు. తాను ఏ పార్టీకి మద్దతు తెలపట్లేదని బీజేపీకి వ్యతిరేకంగా మాత్రమే మాట్లాడుతున్నానని ఆయన గతంలో చెప్పిన విషయం తెలిసిందే. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో ఇటీవల ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ కన్నడ ప్రజలు మతతత్వ పార్టీలకు మద్దతు పలకరని కూడా అన్నారు.