Ram Nath Kovind: అప్పట్లో నో ఎంట్రీ... ఇప్పుడు భారీ స్వాగత ఏర్పాట్లు.. 'ప్రెసిడెన్షియల్‌ ఎస్టేట్‌'కు రాష్ట్రపతి కోవింద్‌!

  • హిమాచల్‌ ప్రదేశ్‌లోని ప్రెసిడెన్షియల్‌ ఎస్టేట్‌ మశోబ్రాకు కోవింద్‌
  • గతేడాది జూన్‌లో బీహార్‌ గవర్నర్‌ హోదాలో వెళ్లిన కోవింద్‌
  • అప్పట్లో అనుమతి లేదని చెప్పిన సిబ్బంది
గత ఏడాది జూన్‌లో బీహార్‌ గవర్నర్‌గా ఉన్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి హిమాచల్‌ ప్రదేశ్‌లోని ప్రెసిడెన్షియల్‌ ఎస్టేట్‌ మశోబ్రాను సందర్శించాలనుకోగా, ఆయనకు అక్కడ చేదు అనుభవం ఎదురైంది. అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ నుంచి అనుమతి లేదని చెబుతూ భద్రతా సిబ్బంది అడ్డుకోగా కోవింద్‌ అక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోయారు. అయితే, ఇప్పుడు రాష్ట్రపతి హోదాలో కోవింద్‌ అధికారికంగా అదే ప్రదేశానికి వెళుతున్నారు.

ఎల్లుండి కోవింద్‌కి అక్కడి సిబ్బంది సాదరంగా స్వాగతం పలికి సత్కారాలు చేయనున్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని మశ్రోబా ఎస్టేట్‌ను 1850లో నిర్మించగా, అది రాష్ట్రపతి కార్యాలయ అధీనంలో ఉంటోంది. హైదరాబాద్‌ శివారులోని బొల్లారంలో రాష్ట్రపతి బస చేసేందుకు భవన్ ఉందన్న విషయం తెలిసిందే. దాని తరువాత ప్రెసిడెన్షియల్‌ ఎస్టేట్‌ మశోబ్రా రెండోది.
Ram Nath Kovind
Himachal Pradesh

More Telugu News