Karnataka: కర్ణాటక అసెంబ్లీలో ఆనందంతో ఉప్పొంగిపోయిన కాంగ్రెస్‌-జేడీఎస్‌ సభ్యులు

  • ఫలించని బీజేపీ ప్రయత్నాలు
  • బీజేపీని ఎదుర్కునేందుకు ఎన్నో ఇబ్బందులు పడ్డ కాంగ్రెస్‌-జేడీఎస్
  • యడ్యూరప్ప రాజీనామా నిర్ణయం ప్రకటించగానే హర్షం
జేడీఎస్‌, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో బీజేపీ నేత యడ్యూరప్ప చేద్దామనుకున్న బేరసారాలు ఫలించలేదు. మెజార్టీ నిరూపించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేసిన బీజేపీ.. అది ఫలించే అవకాశాలు కనపడకపోవడంతో చివరకు విశ్వాస పరీక్షకు వెళ్లడానికి కూడా ఇష్టపడలేదు. బీజేపీని ఎదుర్కోవడానికి ఎంతగానో కష్టపడి పోయిన కాంగ్రెస్‌-జేడీఎస్‌ నేతలు చివరకు తాము అనుకున్నది సాధించారు. దీంతో వారి ఆనందం అంబరాన్ని తాకింది.

యడ్యూరప్ప తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించగానే అసెంబ్లీలో కాంగ్రెస్‌-జేడీఎస్‌ నేతలు విజయ చిహ్నాన్ని చూపెడుతూ ఒకరినొకరు ఆలింగనాలు.. కరచాలనాలు చేసుకుంటూ మురిసిపోయి కనపడ్డారు. మరోవైపు ఆయా పార్టీల ఇతర నేతలు, కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అంటున్నారు. 
Karnataka
Congress
jds

More Telugu News