kodandaram: అక్కడ జరుగుతున్నవన్నీ గలీజు రాజకీయాలే: కోదండరామ్

  • కర్ణాటకతో పాటు దేశంలో జరుగుతున్న గలీజు రాజకీయాలను వ్యతిరేకిస్తున్నాం
  • ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం తమ పార్టీ పని చేస్తుంది
  • నెలాఖరులో ఖమ్మం నుంచి సడక్ బంద్ చేపడతాం
కర్ణాటకలో చోటు చేసుకున్న రాజకీయాలపై తెలంగాణ జనసమితి పార్టీ వ్యవస్థాపకుడు కోదండరామ్ స్పందించారు. అక్కడ జరుగుతున్న రాజకీయాలను చూస్తుంటే బాధ కలుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ విలువలకు వ్యతిరేకంగా ఏది జరిగినా దేశానికి ప్రమాదకరమని చెప్పారు.

కర్ణాటకలోనే కాకుండా, దేశంలో జరుగుతున్న గలీజు రాజకీయాలను వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ప్రత్యామ్నాయ రాజకీయాల కోసం తమ పార్టీ పని చేస్తుందని చెప్పారు. రాజకీయ ప్రక్షాళన కోసమే తాము పార్టీని స్థాపించామని తెలిపారు. కౌలు రైతులకు పెట్టుబడికై పోరాడతామని, భూరికార్డుల్లోని అక్రమాలను అడ్డుకుంటామని... వీటి కోసం ఈ నెలాఖరులో ఖమ్మం నుంచి సడక్ బంద్ చేపట్టనున్నామని చెప్పారు. 
kodandaram
karnataka
politics
tjs
sadak bandh
Telangana

More Telugu News