Karnataka: నేను నా సోదరుడితో కలిసి హోటల్ లో ఉన్నా.. ఆ ఎమ్మెల్యేలు ఎవరో నాకు తెలియదు!: గాలి సోమశేఖరరెడ్డి

  • నాతో ఎవరూ సంప్రదింపులు జరపలేదు
  • ఆనంద్ సింగ్, ప్రతాప్ గౌడ పాటిల్ లు ఎవరో నాకు తెలియదు
  • గోల్డ్ ఫించ్ హోటల్ కు నేను వెళ్లలేదు
కర్ణాటక అసెంబ్లీ సమావేశానికి బీజేపీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి హాజరుకాకపోవడంపై వదంతులు హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్, ప్రతాప్ గౌడ పాటిల్ తో కలిసి ఉన్నారనే వదంతులు వినిపించాయి. ఈ విషయమై సోమశేఖరరెడ్డి స్పందించారు.

 ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘నేను నా సోదరుడితో కలిసి హోటల్ తాజ్ వెస్ట్ ఎండ్ లో ఉన్నా. నాతో ఎవరూ సంప్రదింపులు జరపలేదు. అసలు, ఆనంద్ సింగ్, ప్రతాప్ గౌడ పాటిల్ (కాంగ్రెస్ ఎమ్మెల్యేలు) ఎవరో నాకు తెలియదు. గోల్డ్ ఫించ్ హోటల్ కు నేను వెళ్లను కూడా వెళ్లలేదు’ అని స్పష్టం చేశారు.
Karnataka
gali

More Telugu News