chandramohan: చాలా మంది డబ్బులు ఎగ్గొట్టేశారు: చంద్రమోహన్

  • అప్పట్లో ఆ రెమ్యునరేషన్ ఎక్కువ
  •  వేషం వదులుకునే వాళ్లం కాదు 
  • డబ్బు గురించి తరువాత ఆలోచించేవాళ్లం

ఎన్నో విభిన్నమైన పాత్రలలో ఒదిగిపోతూ అన్నివర్గాల ప్రేక్షకులను చంద్రమోహన్ మెప్పించారు. తాజాగా ఆయన ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన కెరియర్ కి సంబంధించిన విషయాలను పంచుకున్నారు. "ఆ రోజుల్లో మాకు ఇచ్చింది తక్కువ రెమ్యునరేషన్ అని చెప్పలేం. ఎందుకంటే అప్పుడు ఆ రెమ్యునరేషన్ ఎక్కువ. అప్పట్లో ఇచ్చేది మూడు వేలు అనుకుంటే .. అవి ఇప్పుడు మూడు లక్షలతో సమానం అనుకోవాలి"

"ఇక మాకు ఇస్తామని చెప్పిన రెమ్యునరేషన్ ను చాలామంది ఎగ్గొట్టారనే చెప్పాలి. సినిమా పూర్తయిన తరువాత ఇస్తామనీ .. రిలీజ్ అయ్యాక ఇస్తామని అనేవాళ్లు. కొంతమంది చెల్లని చెక్కులు ఇచ్చేవాళ్లు. పోటీ ఎక్కువగా ఉండటం వలన ఆ వేషం బయటికి పోకూడదనే ఉద్దేశంతో, డబ్బులు తప్పకుండా ఇస్తారా? లేదా? అనే విషయాన్ని గురించి ఆలోచించేవాళ్లం కాదు. దీనిని బలహీనతగా తీసుకుని చాలామంది ఎగ్గొట్టేవాళ్లు" అంటూ చెప్పుకొచ్చారు. 

More Telugu News