Rajasimha: 'రుద్రమదేవి' మాటల రచయిత రాజసింహ ఆత్మహత్యాయత్నం!

  • 'ఒక్క అమ్మాయి తప్ప' చిత్రంతో దర్శకుడిగా మారిన రాజసింహ
  • కెరీర్ అభివృద్ధి చెందలేదని మనస్తాపం
  • నిద్రమాత్రలు మింగిన రాజసింహ
అనుష్క ప్రధానపాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన 'రుద్రమదేవి' చిత్రానికి మాటలు రాసిన రచయిత, దర్శకుడు రాజసింహ ముంబైలో ఆత్మహత్యాయత్నం చేశాడు. సందీప్ కిషన్ హీరోగా నటించిన 'ఒక్క అమ్మాయి తప్ప' చిత్రంతో దర్శకుడిగానూ తానేంటో నిరూపించుకున్న రాజసింహ, ముంబైలో నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితిలోకి వెళ్లగా, అతన్ని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నట్టు సమాచారం.

సోఫాలో ఉలుకు, పలుకు లేకుండా ఆయన పడివుండగా, బంధువులు చూసి ఆసుపత్రికి తీసుకెళ్లారు. సినీ వినీలాకాశంలో అనుకున్నంతగా రాణించలేకున్నానని, తన కెరీర్ ను అభివృద్ధి చేసుకోవడంలో వెనుకబడి ఉన్నానన్న మనస్తాపంతోనే రాజసింహ ఈ పని చేసినట్టు తెలుస్తోంది.
Rajasimha
Sucide Attempt
Rudramadevi
Mumbai

More Telugu News