Karnataka: ముందు నేనేంటో చూపిస్తా... ఆ తరువాతే మంత్రులు వస్తారు: యడ్యూరప్ప

షార్ట్స్‌లో చూడండి
ఈ ఉదయం కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం యడ్యూరప్ప మీడియాతో ఒకే ఒక్క మాట చెప్పి వెళ్లిపోయారు. ముందు తానేంటో చూపిస్తానని, అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకుంటానన్న నమ్మకం తనకుందని ఆయన చెప్పారు. బల నిరూపణ తరువాతే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అన్నారు.

కాగా, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండటంతో, అభివృద్ధి కోసం అంటూ ఆ పార్టీ పంచన చేరడానికి జేడీఎస్, కాంగ్రెస్ కు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పటికే సుముఖత వ్యక్తం చేసినట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వారి అండతో బీజేపీ సర్కారు బలపరీక్షలో గట్టెక్కుతుందని అంటున్నారు. కర్ణాటక అసెంబ్లీలో జరిగే బలపరీక్షలో నెగ్గాలంటే బీజేపీకి మరో 8 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరమన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇండిపెండెంట్ గా గెలిచిన ఓ ఎమ్మెల్యే మద్దతు పలుకగా, మరో ఏడుగురి కోసం ఆ పార్టీ ఎదురుచూస్తోంది.
Go Back to Shorts
Karnataka
Oath
Yedeyurappa

More Telugu News