ఏడాది చివరికి టాప్-3లో ఒకటిగా 'ఆనర్' బ్రాండ్... ప్రీమియం ఉత్పత్తులపై ఫోకస్
- అన్ని రకాల ధరల్లో ఉత్పత్తులను తీసుకొస్తూనే ఉంటాం
- ప్రీమియం సెగ్మెంట్లో డిమాండ్ వేగంగా పెరుగుతోంది
- మంచి ఫీచర్లు, కొత్తదనం కోరుకుంటున్నట్టు వెల్లడి
‘‘వినియోగదారులు మంచి ఫీచర్లు, కొత్తదనం కోరుకుంటున్నారు. మొత్తం స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో ప్రీమియం వాటా 3 శాతంలోపే ఉంది. ఇది చాలా వేగంగా పెరుగుతోంది’’ అని హువావే వైస్ ప్రెసిడెంట్ పి.సంజీవ్ అన్నారు. అన్ని రకాల ధరల శ్రేణిలో ఉత్పత్తులను తీసుకొస్తూనే ఉంటామని, ఈ ఏడాది చివరికి టాప్-3లో ఒకటిగా నిలవాలనుకుంటున్నట్టు చెప్పారు. ఆనర్ దేశీయంగా ఐదో స్థానానికి చేరుకుందంటూ కౌంటర్ పాయింట్ రీసెర్చ్ విడుదల చేసిన నివేదికను ఆయన గుర్తు చేశారు.