honor smart phones': ఏడాది చివరికి టాప్-3లో ఒకటిగా 'ఆనర్' బ్రాండ్... ప్రీమియం ఉత్పత్తులపై ఫోకస్

  • అన్ని రకాల ధరల్లో ఉత్పత్తులను తీసుకొస్తూనే ఉంటాం
  • ప్రీమియం సెగ్మెంట్లో డిమాండ్ వేగంగా పెరుగుతోంది
  • మంచి ఫీచర్లు, కొత్తదనం కోరుకుంటున్నట్టు వెల్లడి

చైనాకు చెందిన హువావే సబ్ బ్రాండ్ ‘ఆనర్’ దేశీయ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో అగ్ర స్థానంపై కన్నేసింది. ఈ ఏడాది చివరి నాటికి టాప్ 3లోకి చేరుకుంటామన్న ఆశాభావాన్ని కంపెనీ వ్యక్తం చేసింది. ఆనర్ 10 స్మార్ట్ ఫోన్ ను కంపెనీ తాజాగా తీసుకొచ్చిన నేపథ్యంలో ప్రీమియం ఉత్పత్తులకు (రూ.30,000కుపైన)  వినియోగదారుల నుంచి మంచి డిమాండ్ ఉందని పేర్కొంది.

‘‘వినియోగదారులు మంచి ఫీచర్లు, కొత్తదనం కోరుకుంటున్నారు. మొత్తం స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో ప్రీమియం వాటా 3 శాతంలోపే ఉంది. ఇది చాలా వేగంగా పెరుగుతోంది’’ అని హువావే వైస్ ప్రెసిడెంట్ పి.సంజీవ్ అన్నారు. అన్ని రకాల ధరల శ్రేణిలో ఉత్పత్తులను తీసుకొస్తూనే ఉంటామని, ఈ ఏడాది చివరికి టాప్-3లో ఒకటిగా నిలవాలనుకుంటున్నట్టు చెప్పారు. ఆనర్ దేశీయంగా ఐదో స్థానానికి చేరుకుందంటూ కౌంటర్ పాయింట్ రీసెర్చ్ విడుదల చేసిన నివేదికను ఆయన గుర్తు చేశారు. 

More Telugu News