facebook: నకిలీ అకౌంట్లపై ఫేస్ బుక్ ఉక్కుపాదం.... 58.3 అకౌంట్లు క్లోజ్!

  • అశ్లీల, హింసాత్మక కంటెంట్ ఉండడం వల్లే
  • ఇప్పటికీ ఖాతాల్లో 3-4 శాతం నకిలీలే
  • ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో గుర్తింపు

ఫేక్ (నకిలీ) అకౌంట్లపై ఫేస్ బుక్  ఉక్కుపాదం మోపింది. 58.3 కోట్ల ఖాతాలను మూసేసింది. 2018 జనవరి నుంచి మార్చి వరకు ఈ ఖాతాలను డిలీట్ చేసేసింది. ఈ విషయాన్ని ఫేస్ బుక్ స్వయంగా వెల్లడించింది. సెక్సువల్, హింసాత్మక ఫొటోలు, ఉగ్రవాద ప్రచారం లేదా ద్వేషపూరిత ప్రసంగాలు తదితర కంటెంట్ తో ఉన్న ఖాతాలు ఇవి కావడం గమనార్హం.

ప్రతీ రోజూ లక్షలాది నకిలీ ఖాతాలు ఫేస్ బుక్ వేదికపై పుడుతున్నట్టు సంస్థ తెలిపింది. ఇప్పటికీ మొత్తం ఖాతాల్లో 3-4 శాతం నకిలేవనని పేర్కొంది. ఇక స్పామ్ తో కూడిన 83.7 కోట్ల పోస్ట్ లను సైతం తొలగించింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో అశ్లీల, నిబంధనలకు విరుద్ధమైన కంటెంట్ ను గుర్తిస్తోంది.

More Telugu News