కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుపై.. కీలక ప్రకటనలు చేసిన గులాంనబీ ఆజాద్, సిద్ధరామయ్య
- ఇప్పటివరకు 65 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్
- 93 స్థానాల్లో గెలిచిన బీజేపీ
- జేడీఎస్‌కి మద్దతిస్తున్నామంటూ కాంగ్రెస్ కీలక ప్రకటన
జేడీఎస్‌కు మద్దతు ఇవ్వాలని తాము నిర్ణయం తీసుకున్నట్లు ఇతర కాంగ్రెస్ నేతలు కీలక ప్రకటన చేశారు. తాము జేడీఎస్ నేతలు దేవెగౌడ, కుమారస్వామితో చర్చలు జరిపామని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని గవర్నర్ ను కోరతామని అన్నారు. జేడీఎస్ నుంచి ఎవరు ముఖ్యమంత్రి అయినా తమ మద్దతు ఉంటుందని తెలిపారు.