yogi adityanath: యూపీ సీఎం యోగికి తప్పిన ప్రమాదం... పొలాల్లో అర్థాంతరంగా హెలికాప్టర్ ల్యాండింగ్

  • హెలిప్యాడ్ కిలోమీటరు దూరంలో ఉండగా హెలికాప్టర్లో సమస్య
  • దీంతో అత్యవసరంగా దించేసిన పైలట్
  • సీఎం సురక్షితమని ప్రకటించిన ప్రభుత్వం

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అత్యవసరంగా పొలాల్లో ల్యాండయింది. ముఖ్యమంత్రి క్షేమంగా ఉన్నట్టు యూపీ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ మీడియాకు తెలిపారు. సహావర్ తాలూకా ఫరౌలి గ్రామంలో ఇటీవల ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు హత్యకు గురికాగా, వారి కుటుంబాన్ని ముఖ్యమంత్రి ఈ రోజు పరామర్శించాల్సి ఉంది.

అలాగే, అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్ తో సమీక్ష కూడా నిర్వహించనున్నారు. సీఎం రాక నేపథ్యంలో ఫరౌలి గ్రామ సమీపంలోని కస్తూర్బా విద్యాలయంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. అయితే, కిలోమీటరు దూరంలో ఉండగానేే హెలికాప్టర్ లో సమస్య ఏర్పడడంతో పైలట్ వెంటనే దాన్ని పొలాల్లో సురక్షితంగా దించేశారు. అనంతరం ముఖ్యమంత్రి యథావిధిగా షెడ్యూల్ ప్రకారం తన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్లారు.

More Telugu News