nani: నానితో కొరటాల మూవీ ఖాయమైపోయినట్టే!

  • 'భరత్' తో హిట్ కొట్టేసిన కొరటాల 
  • తదుపరి ప్రాజెక్టు నానితో
  • నిర్మాతగా కొరటాల స్నేహితుడు  

కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన 'భరత్ అనే నేను' 200 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. మహేశ్ బాబు కెరియర్లోనే ఈ సినిమా చెప్పుకోదగినదిగా నిలిచింది. ఈ నేపథ్యంలో కొరటాల తదుపరి సినిమా ఏ హీరోతో వుండనుందనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. ఈ క్రమంలో అల్లు అర్జున్ .. చిరంజీవి పేర్లు వినిపించాయి. ఈ ఇద్దరిలో ఆయన చిరంజీవితో సినిమా చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

అయితే ప్రస్తుతం సెట్స్ పై వున్న 'సైరా' సినిమాను పూర్తి చేయడానికి చిరంజీవికి చాలా సమయం పడుతుంది. అందువలన ఈ లోగా కొరటాల .. నానితో ఒక సినిమా చేయాలని నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. ఆల్రెడీ నానికి కొరటాల కథ వినిపించడం .. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం జరిగిపోయాయని అంటున్నారు. కొరటాల స్నేహితుడు సుధాకర్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నట్టు సమాచారం.  

More Telugu News