Pawan Kalyan: తిరుపతి చేరుకున్న పవన్‌ కల్యాణ్‌

  • తిరుమల వెళ్లిన జనసేనాని
  • రేపు ఉదయం శ్రీవారి దర్శనం
  • ఏపీలో బస్సు యాత్ర షెడ్యూల్ పై ప్రకటన
జనసేన అధినేత, సినీనటుడు పవన్‌ కల్యాణ్‌ ఈ రోజు విమానంలో తిరుపతి చేరుకున్నారు. తాను ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టనున్న బస్సు యాత్రకు ముందు శ్రీవారిని దర్శించుకోనున్నారు. రేపు ఉదయం స్వామివారిని దర్శించుకున్న తరువాత పవన్‌ కల్యాణ్‌ తిరుమల నుంచే తన బస్సు యాత్ర షెడ్యూల్‌ ను విడుదల చేయనున్నట్లు తెలిసింది.

తన రాకతో తిరుమలలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో పవన్‌ తన తిరుపతి పర్యటన గురించి ప్రకటన చేయలేదని సమాచారం. ఇదిలా ఉంచితే, నిన్న బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా కాన్వాయ్‌పై దాడి జరిగిన నేపథ్యంలో పవన్‌ కల్యాణ్‌కు భద్రత పెంచాలని పోలీసులు నిర్ణయించినట్లు తెలుస్తోంది.     
Pawan Kalyan
Andhra Pradesh
Tirupati

More Telugu News