lalu: రేపు లాలూ కుమారుడి వివాహం.. ఇంటి ముందు వివాదాస్పద పోస్టర్లు!

షార్ట్స్‌లో చూడండి
బీహార్‌ ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజ్ ప్రతాప్ వివాహం రేపు వైభవంగా జరగనుంది. ఈ సందర్భంగా ఆయన ఇంటి ముందు వెలిసిన ఓ పోస్టర్‌ వివాదాస్పదం అవుతోంది. అందులో పెళ్లి కొడుకు, పెళ్లికూతురు తేజ్ ప్రతాప్-ఐశ్వర్యల ఫొటోలు శివపార్వతుల రూపంలో ఉన్నాయి.

ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పోస్టర్లపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఇలాంటి పోస్టర్లు పెట్టడమేంటని ప్రశ్నించారు. కాగా, రేపు సాయంత్రం జరిగే వీరి వివాహానికి రాజకీయ, సినీ, పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు.
Go Back to Shorts
lalu
bihar
marriage

More Telugu News