శామ్ సంగ్ నుంచి ఈ నెల్లోనే బడ్జెట్ ధరలో బెజెల్ లెస్ ఫోన్లు
- జె సిరీస్ ఫోన్ల ధరలు రూ.15,000-20,000 మధ్య
- ఎ6, ఎ6+ ఫోన్ల ధరలు రూ.20,000 పైన
- పరిశ్రమ వర్గాల వెల్లడి
సూపర్ అమోలెడ్ ఇన్ఫినిటీ డిస్ ప్లేతో ఇవి వుంటాయి. ఇటీవల ఫుల్ స్క్రీన్ మొబైల్స్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. నిజానికి శామ్ సంగ్ గెలాక్సీ 8, గెలాక్సీ 9 సిరీస్ ఫోన్లు ఇన్ఫినిటీ డిస్ ప్లేతో కూడినవే. కాకపోతే వీటి ధరలు రూ.40,000 పైమాటే. ఫుల్ స్క్రీన్ డిస్ ప్లే మొబైల్స్ హవా నడుస్తుండడంతో శామ్ సంగ్ సైతం తక్కువ ధరలతో మోడళ్ల విడుదల ద్వారా మార్కెట్ వాటాపై కన్నేసింది.