sai madhav burra: అమాయకత్వం .. అతి ప్రేమ కారణంగానే సావిత్రి కుంగిపోయారు!: సాయిమాధవ్ బుర్రా

షార్ట్స్‌లో చూడండి
సావిత్రి జీవితచరిత్రగా తెరకెక్కిన 'మహానటి' సినిమాకి అపూర్వమైన ఆదరణ లభిస్తోంది. ఈ సినిమాకి సంభాషణలు సమకూర్చిన సాయిమాధవ్ బుర్రాకి మంచి పేరు వచ్చింది. తాజాగా ఆయన ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సావిత్రి గురించిన అనేక విషయాలను ప్రస్తావించారు.

 "తనకి భార్యా పిల్లలు ఉన్నారనే విషయాన్ని సావిత్రితో పెళ్లికి ముందే జెమినీ గణేశన్ చెప్పారు. ఆయనని చేసుకుంటే నీ జీవితం ఇలా వుంటుందనే విషయాన్ని కూడా సావిత్రికి చాలామంది చెప్పారు. అంతా ఏదైతే చెప్పారో అదే జరిగింది. ఇక్కడ సావిత్రిగారి అమాయకత్వం .. ఆమె పిచ్చిప్రేమ .. ఆ ప్రేమ కోసం ఏమైనా అవ్వడం .. అలా అవడానికి ఇష్టపడటం .. ఎదుటివ్యక్తి పట్ల గల ప్రేమను తనపై కోపంగా మార్చుకోవడం సావిత్రిగారు చేశారు. ఇక జెమినీ గణేశన్ గారు ప్రాక్టికల్ గా ఆలోచించారు. ఆయన వల్లనే సావిత్రి మానసికంగా కుంగిపోయారు. వాళ్లిద్దరూ మంచి తల్లిదండ్రులు కాగలిగారు గానీ, మంచి భార్యాభర్తలు కాలేకపోయారు" అని చెప్పుకొచ్చారు.    

Go Back to Shorts
sai madhav burra

More Telugu News