earthquake: ఢిల్లీ వాసులను వణికించిన భూప్రకంపనలు

  • ఆఫ్ఘనిస్థాన్ లో 6.2 తీవ్రతతో భూకంపం
  • కాసేపటి తర్వాత నార్త్ ఇండియాలో పలు చోట్ల ప్రకంపనలు
  • ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులుతీసిన జనం

దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తర భారతంలోని గుర్గావ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్ లను భూ ప్రకంపనలు వణికించాయి. ఈ మధ్యాహ్నం ఆఫ్ఘనిస్థాన్ లో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించిన తర్వాత మన దేశంలోని పలు ప్రాంతాల్లో కొద్ది పాటి ప్రకంపనలు వచ్చాయి.

ప్రకంపనల నేపథ్యంలో తీవ్ర భయాందోళనలకు గురైన ప్రజలు ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు పెట్టారు. సాయంత్రం 4.15 గంటల సమయంలో ఈ ప్రకంపనలు వచ్చాయి. మరోవైపు, యునైటెడ్ స్టేట్స్ జియొలాజికల్ సర్వే తెలిపిన వివరాల ప్రకారం భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్థాన్-తజికిస్థాన్ సరిహద్దుల్లో 111.9 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉంది.  

More Telugu News