jerusalem: ఓటుకు నోటు కేసులో జిమ్మి బాబును తప్పించి.. నన్ను ఇరికించారు!: జెరూసలెం మత్తయ్య

  • కేసుతో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిని విచారించాలి
  • ఓట్లు అడిగిన ఎమ్మెల్యేలందరి కాల్స్ పై దర్యాప్తు జరిపించాలి
  • కుట్ర పూరితంగా కేసు పెట్టించి.. నన్ను ఏ4గా చేర్చారు

'ఓటుకు నోటు' కేసును తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి తెరపైకి తీసుకురావడంతో... ఇరు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ పెరిగింది. ఈ నేపథ్యంలో, ఈ కేసులో కీలక పాత్రధారిగా పేరుగాంచిన జెరూసలెం మత్తయ్య స్పందించారు. కేసును పున:సమీక్షించిన కేసీఆర్ కు ధన్యవాదాలు తెలుపుతున్నానని ఆయన అన్నారు.

ఓటుకు నోటు కేసుపై సీబీఐ చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేసుతో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిని విచారించాలని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు ఓట్లు అడిగిన ఎమ్మెల్యేలందరి ఫోన్ కాల్స్ పై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కుట్రపూరితంగా కేసు పెట్టించి, తనను ఏ4గా చేర్చారని మండిపడ్డారు. జిమ్మిబాబును తప్పించి తన పేరును తెరపైకి తీసుకొచ్చారని అన్నారు. 

More Telugu News