ఈ కుట్ర వెనక బీజేపీ, ఆరెస్సెస్ ల హస్తం ఉంది: రాయలసీమ పోరాట సమితి
- టీటీడీలోని ఐఏఎస్ అధికారులు కేంద్రానికి ఏజెంట్లుగా పని చేస్తున్నారు
- వీరి వల్లే శ్రీవారి ఆస్తులపై కేంద్రం కన్ను పడింది
- ఈ కుట్ర వెనుక బీజేపీ, ఆరెస్సెస్ ల హస్తం ఉంది
టీటీడీ ఈవోకు కేంద్ర పురావస్తు శాఖ లేఖ రాయడం, ఆ తర్వాత వెంటనే ఉపసంహరించుకోవడం అనేక అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. ఈ కుట్ర వెనుక బీజేపీ, ఆరెస్సెస్ ల హస్తం ఉందని తెలిపారు. తిరుమల కొండపైన ఏ పురాతన కట్టడాన్నైనా తొలగించాలన్నా, కొత్త నిర్మాణాన్ని చేపట్టాలన్నా ఆగమ సలహామండలి సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని...కానీ, వారి సూచనలను టీటీడీ అధికారులు పట్టించుకోకపోవడంతో... ఆలయ ప్రతిష్ట మసకబారుతోందని విమర్శించారు.