సివిల్స్ లో అంతే... టాపర్ అనుదీప్ కు వచ్చిన మార్కుల వివరాలు!
- 55.60 శాతం మార్కులతోనే తొలి స్థానానికి
- రాత పరీక్షలో 950, ఇంటర్వ్యూలో 176 మార్కులు
- రెండో స్థానంలో నిలిచిన అనూ కుమారికి ఇంటర్వ్యూలో 187 మార్కులు
మొత్తం 2,025 మార్కులకు (మెయిన్ పేపర్ 1,750 మార్కులకు, ఇంటర్వ్యూను 275 మార్కులుకు) పోటీ పడిన అనుదీప్ కు వచ్చింది 1,126 మార్కులేనంటే, పరీక్షా విధానం, జవాబుపత్రాల వాల్యూషన్ ఎంత కఠినంగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇదే పరీక్షల్లో రెండో స్థానంలో నిలిచిన అనూ కుమారికి 1,124 మార్కులు వచ్చాయి. ఆమె రాత పరీక్షలో 937, ఇంటర్వ్యూలో 187 మార్కులను సాధించి 55.50 శాతంతో ఉత్తీర్ణత సాధించింది. మూడో స్థానంలో నిలిచిన సచిన్ గుప్తాకు రాత పరీక్షలో 946, ఇంటర్వ్యూలో 176 మార్కులు రాగా 55.40 శాతంతో ఉత్తీర్ణుడయ్యారు.