Tollywood: ప్రజల చెవుల్లో ప్రధానే స్వయంగా పూలు పెడుతున్నారు!: నటుడు ప్రకాశ్‌రాజ్‌

  • మహదాయి నీటి పంపిణీ వ్యవహారంలో అబద్ధాలు చెబుతున్నారు
  • బీజేపీ చెప్పే అబద్ధాలు ప్రజలను కష్టాలపాలు చేస్తున్నాయి
  • ప్రశ్నించే నాపై ‘హిందూమత వ్యతిరేకి’గా ముద్ర వేస్తున్నారు
కర్ణాటకలోని మహదాయి నీటి పంపిణీ వ్యవహారంలో అబద్ధాలు చెబుతున్నారని, స్వయంగా ప్రధాన మంత్రే ప్రజల చెవుల్లో పూలు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ విమర్శించారు. బీజేపీ నాయకులు చెప్పే అబద్ధాలు ప్రజలను కష్టాలపాలు చేస్తున్నాయని మండిపడ్డారు. దళితులకు తానే ఆశాకిరణమంటూ మోదీ అబద్ధాలు చెబుతున్నారని, అల్ప సంఖ్యాకులను దేశం నుంచి బయటకు పంపేందుకు యత్నిస్తున్నారంటూ ఆరోపించారు.

ఏ విషయం గురించి అయినా తాను ప్రశ్నిస్తే ‘హిందూమత వ్యతిరేకి’ అంటూ ముద్ర వేస్తున్నారని విమర్శించారు. ‘జస్ట్ ఆస్కింగ్’ పేరిట ప్రశ్నించే బాధ్యత తనకు ఉందని, ‘జస్ట్ ఆస్కింగ్’ అనేది ఒక రాజకీయ పార్టీ కాదని అదొక ఆందోళన సంస్థ అని ప్రకాష్ రాజ్ మరోసారి స్పష్టం చేశారు. తాను చేసే పోరాటంలో ఎలాంటి రాజకీయాలు, దురుద్దేశం లేవని ఈ విషయాన్ని మళ్లీ మళ్లీ చెబుతున్నానని హుబ్లీలో విలేకరులతో మాట్లాడిన ప్రకాష్ రాజ్ అన్నారు.
Tollywood
Prakash Raj

More Telugu News