Salman Khan: నేడు జోధ్ పూర్ సెషన్స్ కోర్టుకు సల్మాన్ ఖాన్... !

  • గత నెలలో 5 సంవత్సరాల శిక్ష విధించిన కోర్టు
  • ఆపై రెండు రోజుల్లోనే బెయిల్ 

1998 నాటి కృష్ణ జింకల వేట కేసు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ను ఇంకా వెంటాడుతోంది. ఏప్రిల్ 5న కేసులో తీర్పునిస్తూ, సల్మాన్ కు 5 సంవత్సరాల జైలుశిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఆపై రెండు రోజుల్లో ఆయన బెయిల్ పై బయటకు వచ్చాడు. అలాగే, ఆ కేసు తీర్పును సవాల్ చేస్తూ సల్మాన్ జోధ్ పూర్ సెషన్స్ కోర్టులో పిటిషన్ వేశాడు. అది ఈ రోజు విచారణకు వస్తుండడంతో, సల్మాన్ కోర్టుకి హాజరు కావలసి వుంది. ఈ క్రమంలో గత రాత్రి తన చెల్లెలు అల్విరా ఖాన్, స్నేహితుడు బాబా సిద్దిఖీతో కలసి జోధ్ పూర్ చేరుకున్న ఆయన, తన న్యాయవాదులతో చర్చలు జరిపాడు.

 1998లో 'హమ్ సాథ్ సాథ్ హై' చిత్రం షూటింగ్ వేళ, సహ నటులు సైఫ్ అలీ ఖాన్, నీలమ్, టబు, సోనాలీ బెంద్రే, జోధ్ పూర్ వాసి దుష్యంత్ సింగ్ లతో కలసి వెళ్లి కృష్ణ జింక లను వేటాడినట్టు ఆరోపణలు రుజువైన సంగతి తెలిసిందే.

More Telugu News