Hyderabad: తెలంగాణ రాజకీయ నేతలు, అధికారులు ఉన్న వాట్స్ యాప్ గ్రూప్ లో అశ్లీల ఫొటోలు!

  • శ్రీకాంతాచారి అభిమాన సంఘం పేరిట గ్రూప్
  • అశ్లీల ఫొటోలు పోస్టు చేసిన అజ్ఞాత వ్యక్తి
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన అడ్మిన్

ప్రత్యేక తెలంగాణ కావాలంటూ ఉస్మానియా యూనివర్శిటీలో వేలాది మంది చూస్తుండగా, ఆత్మబలిదానం చేసిన శ్రీకాంతాచారి అభిమాన సంఘం వాట్స్ యాప్ గ్రూప్ అది. దీనిలో తెలంగాణ రాజకీయ నేతలు, ఉన్నతాధికారులు ఎందరో సభ్యులుగా ఉన్నారు. ఈ గ్రూప్ లో ఓ అజ్ఞాతవ్యక్తి అశ్లీల ఫొటోలను పోస్టు చేయడం కలకలం రేపింది. ఆ ఫొటోలతో తమకు సంబంధం లేదని చెబుతున్న గ్రూప్ అడ్మిన్, అశ్లీల ఫొటోలు పోస్టు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని చెబుతూ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఫొటోలు పెట్టిన వ్యక్తిని గుర్తించేందుకు చర్యలు చేపట్టారు.

More Telugu News