Regina: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • తొలిసారిగా డబ్బింగ్ చెప్పిన రెజీనా 
  • 'రాజుగాడు' రావడం కాస్త లేట్!
  • రాయలసీమ యాసలో మాట్లాడుతున్న ఎన్టీఆర్  

*  ఇప్పటి వరకు తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాలలో నటించినప్పటికీ కథానాయిక రెజీనా, ఇంతవరకు ఒక్క చిత్రంలో కూడా తనకు తాను డబ్బింగ్ చెప్పుకోలేదు. ఈ క్రమంలో తాజాగా 'మిస్టర్ చంద్రమౌళి' అనే తమిళ చిత్రంలో తొలిసారిగా ఈ ముద్దుగుమ్మ డబ్బింగ్ చెప్పింది. డబ్బింగ్ చెప్పడాన్ని ఎంతో ఎంజాయ్ చేశానని అంటోంది.
*  రాజ్ తరుణ్ నటించిన 'రాజుగాడు' చిత్రం విడుదల వాయిదా పడింది. ముందు ప్రకటించిన ప్రకారం ఈ నెల 11న ఈ చిత్రం విడుదల కావలసి వుంది. అయితే, దీనిని జూన్ 1కి వాయిదా వేసినట్టు తాజా సమాచారం. సంజన దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమైరా దస్తర్ నాయికగా నటించింది.
*  ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ లో రూపొందుతోంది. దీంతో ఈ సినిమాలో ఎన్టీఆర్ రాయలసీమ యాసతో మాట్లాడతాడట. అలాగే ఇందులో రాయలసీమకు చెందిన ఒక ఫోక్ సాంగ్ కూడా ఉంటుందట.    

More Telugu News