deve gouda: కర్ణాటకను కేంద్రం ఏమాత్రం పట్టించుకోవట్లేదు!: సిద్ధరామయ్య

  • ఒక మాటపై నిలబడని పార్టీలకు ప్రజలు ఓట్లు ఎలా వేస్తారు?
  • జేడీఎస్‌తో పొత్తు పెట్టుకోకపోయినా గెలుస్తాం
  • మరి మోదీ అప్పుడు రెండు చోట్ల ఎందుకు పోటీ చేశారు? 

ఈ నెల 12న జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమపై చేస్తోన్న విమర్శలు ఏ మాత్రం ప్రభావం చూపవని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. ఇటీవల జేడీఎస్‌ అధినేత దేవెగౌడపై మోదీ ప్రశంసల జల్లు కురిపించి, మళ్లీ ఇప్పుడు ఆ పార్టీకి ఓట్లే వేయద్దని అంటున్నారని అన్నారు. ఒక మాటపై నిలబడని పార్టీలను ప్రజలు ఎలా నమ్మగలరని ఆయన ప్రశ్నించారు.

కర్ణాటకలో తాము జేడీఎస్‌తో పొత్తు పెట్టుకోకున్నా సులభంగా గెలుస్తామని సిద్ధరామయ్య ధీమా వ్యక్తం చేశారు. తమ రాష్ట్రంలో రెండుసార్లు తీవ్ర కరవుతో వచ్చినప్పుడు మోదీ ఏ మాత్రం పట్టించుకోలేదని, కేంద్ర సర్కారు ఎలాంటి సాయం చేయలేదని అన్నారు. అలాగే గోవాతో తమ రాష్ట్రానికి ఉన్న మహాదాయి నదీ జలాల వివాదాన్ని కూడా పట్టించుకోవట్లేదని అన్నారు. తాను రెండు చోట్ల పోటీచేయడంపై మోదీ తనపై విమర్శలు చేశారని, మరి గత సార్వత్రిక ఎన్నికల్లో వడోదర, వారణాసి నియోజకవర్గాల నుంచి మోదీ చేశారు కదా? అని సిద్ధరామయ్య ప్రశ్నించారు.

More Telugu News