jyothi: మాది మధ్యతరగతి కుటుంబం .. హీరోయిన్ అయిపోదామని వచ్చాను: నటి జ్యోతి

  • డాన్స్ .. నటన అంటే ఇష్టం 
  • సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగాను 
  • ఎస్వీ కృష్ణారెడ్డిగారు మంచి ఛాన్స్ ఇచ్చారు 

తెలుగు తెరపై సందడి చేసే పాత్రల్లో కనిపిస్తూనే, సరైన గుర్తింపు తెచ్చే పాత్రల కోసం జ్యోతి ఎదురుచూస్తోంది. తాజాగా ఆమె ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక విషయాలను గురించి ప్రస్తావించింది. మాది మధ్యతరగతి కుటుంబం. మొదటి నుంచి కూడా నాకు నటన .. డాన్స్ అంటే ఇష్టం. సినిమాల్లోకి వెళ్లడానికి మా నాన్న నన్ను ఎంతగానో ప్రోత్సహించారు.

వైజాగ్ లో ఫొటో షూట్ చేసుకుని .. హీరోయిన్ అయిపోదామనే ఉద్దేశంతో హైదరాబాద్ లోని సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగాను. చివరికి ఒక సినిమాలో హీరోయిన్ గా అవకాశం వచ్చింది. ఆ సినిమా ఆడియో రిలీజ్ కి ముఖ్య అతిథిగా ఎస్వీ కృష్ణారెడ్డిగారు వచ్చారు. ఆయన సినిమాలో చేయాలని ఉందని చెప్పాను. తన సినిమాలో ఒక రోల్ వుంది చేయమన్నారు. హీరోయిన్ గా అయితేనే చేస్తానని చెబితే .. వేరే రోల్ కి ఒప్పించారు. ఆ తరువాత 'హంగామా' సినిమాలో హీరోయిన్ గాను ఛాన్స్ ఇచ్చారు" అంటూ చెప్పుకొచ్చింది.   

More Telugu News