Chandrababu: అందుకే, ఏటీఎంలలో డబ్బుల్లేవు!: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

షార్ట్స్‌లో చూడండి
పెద్దనోట్లన్నీ చంద్రబాబు ఖజానాకు వెళ్లాయని, అందుకే, ఏటీఎంలలో డబ్బుల్లేవని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో రాక్షసపాలన కొనసాగుతోందని, ఏపీని తండ్రీకొడుకులు దోచేస్తున్నారంటూ చంద్రబాబు, లోకేశ్ పై ఆయన విరుచుకుపడ్డారు.

చంద్రబాబు నాలుగేళ్లలో మూడు లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. చంద్రబాబులో హిట్లర్, గోబెల్ లక్షణాలు ఉన్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా గురించి ప్రస్తావిస్తూ, వచ్చే సాధారణ ఎన్నికల్లో తమ పార్టీకి 25 స్థానాలు వస్తే ఏపీకి తప్పకుండా ప్రత్యేకహోదా వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 
Go Back to Shorts
Chandrababu
vijayasai reddy

More Telugu News