రాహుల్ వయసెంత.. మీ వయసెంత.. సిగ్గుగా లేదా, మోదీ గారూ?: ప్రకాష్ రాజ్
- 2019 తర్వాత మోదీకి పనేం ఉండదు
- కర్ణాటక వస్తే మా వాళ్లు కన్నడ నేర్పిస్తారు
- మోదీ పతనం కర్ణాటక నుంచే ప్రారంభమవుతుంది
కర్ణాటక ప్రచారంలో మోదీ కన్నడ ప్రసంగాన్ని ఎద్దేవా చేస్తూ, ప్రకాష్ రాజ్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. సింధనూరులో దళిత, ప్రగతిపర సంఘాలు ఏర్పాటు చేసిన 'ప్రజాస్వామ్య రక్షణ కోసం' అనే కార్యక్రమంలో ప్రకాష్ రాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కన్నడలో మాట్లాడిన ప్రసంగాన్ని అనుకరించి చూపారు. కాయగూరలు అమ్మినట్టు ఏమిటండీ ఈ భాష? అంటూ ఎద్దేవా చేశారు.
మరోవైపు రాహుల్ గాంధీ ప్రసంగాలను తప్పుబడుతున్న మోదీని ఉద్దేశించి... రాహుల్ వయసెంత? మీ వయసెంత? సిగ్గుగా లేదా? అని అన్నారు. తాను ఏ పార్టీ వ్యక్తిని కాదని... బీజేపీ అంటే తనకు భయం లేదని చెప్పారు.