Chota Rajan: జీవిత ఖైదు పడిందని తెలిసిన తరువాత 'ఏం ఫర్లేదులే' అన్న గ్యాంగ్ స్టర్ చోటా రాజన్!

  • జర్నలిస్టు జేడే హత్య కేసులో శిక్ష
  • మరాఠీలో తీర్పును చదివిన కోర్టు
  • ఆందోళన చూపని చోటా రాజన్

జర్నలిస్టు జేడే హత్య కేసులో తనకు జీవిత ఖైదు పడిందని తెలుసుకున్న తరువాత గ్యాంగ్ స్టర్ చోటా రాజన్ ఏ మాత్రం ఆందోళన చెందలేదని తెలుస్తోంది. ఈ కేసులో రాజన్ తో పాటు షార్ప్ షూటర్ రోహిత్ తంగప్ప, అరుణ్ డాకే, అనిల్ వాగ్ మోడ్, మంగేష్ అగావనే, సచిన్ గైక్వాడ్, అభిజిత్ షిండే, నీలేష్ షెడ్జీ లకూ ఇదే శిక్షను మోకా చట్టం కింద కేసు విచారించిన న్యాయస్థానం తీర్పిచ్చిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం తీహార్ జైల్లో కాలం గడుపుతున్న రాజన్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టిన వేళ, తీర్పును మరాఠీలో రాజన్ కు వినిపించారు. శిక్ష గురించి విన్న తరువాత రాజన్ ఏం ఫర్లేదులే అని వ్యాఖ్యానించాడట. మొత్తం 599 పేజీలున్న తీర్పు కాపీని దోషికి అందించాలని ఈ సందర్భంగా స్పెషల్ జడ్జ్ సమీర్ ఎస్ అద్కర్ ఆదేశించారు.

More Telugu News