Naa Peru Surya: విడుదలకు ముందే రూ. 85 కోట్లు రాబట్టిన 'నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా'!

  • రేపు విడుదల కానున్న 'నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా'
  • ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 85.87 కోట్లు
  • వెల్లడించిన వంశీ శేఖర్

అల్లు అర్జున్ హీరోగా నిర్మితమై, రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న 'నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా' రిలీజ్ కు ముందే రూ. 85 కోట్లు రాబట్టింది. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ను పీఆర్వో వంశీ శేఖర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకున్నారు. ఈ సినిమాకు నైజాంలో రూ. 21 కోట్లు, విశాఖలో రూ. 8 కోట్లు, సీడెడ్ లో రూ. 12 కోట్లు, యూఎస్ లో రూ. 7 కోట్లు, మిగతా దేశాల్లో రూ. 2 కోట్లు, కేరళలో రూ. 3 కోట్లు, బెంగళూరులో రూ. 9 కోట్లు, గుంటూరులో రూ. 5.5 కోట్లు, పశ్చిమ గోదావరిలో రూ. 4.2 కోట్లు, తూర్పు గోదావరిలో రూ. 5.4 కోట్లు, నెల్లూరులో రూ. 2.52 కోట్లు, కృష్ణాలో రూ. 5 కోట్ల వ్యాపారం జరిగిందని వెల్లడించారు. మొత్తం రూ. 85.87 కోట్ల బిజినెస్ జరిగిందని తెలిపారు.

More Telugu News