చార్మినార్ ఎక్స్ ప్రెస్ రైల్లో ఘోరం... టాయిలెట్ నీటితో టీ... వీడియో బయటకు రావడంతో రూ. లక్ష జరిమానా!
- సికింద్రాబాద్ స్టేషన్లో ఘటన
- సోషల్ మీడియాలో వైరల్
- లైసెన్స్ రద్దు చేసిన అధికారులు
ఈ వీడియోను చార్మినార్ ఎక్స్ ప్రెస్ లో కొన్నాళ్ల క్రితం తీసినట్టు తెలుస్తోంది. టీ క్యాన్ ను టాయిలెట్ లోకి తీసుకుని వెళ్లిన వెండర్, దానిలో ఉన్న టీలో నీటిని నింపుకుని రావడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, విచారణ అనంతరం అతనిపై జరిమానా విధించామని అధికారులు తెలిపారు. అతని పేరు పీ శివప్రసాద్ అని, సికింద్రాబాద్ నుంచి కాజీపేట మధ్య తిరిగే రైళ్లలో టీ అమ్మేందుకు లైసెన్స్ పొందాడని, అతని లైసెన్స్ ను రద్దు చేశామని తెలిపారు.