BJP: దళితుడి ఇంటికి భోజనానికి వెళ్లి.. హోటల్ నుంచి తెచ్చుకున్న ఆహారాన్ని తిన్న బీజేపీ మంత్రి!

షార్ట్స్‌లో చూడండి
ఉత్తరప్రదేశ్‌కు చెందిన మరోమంత్రి వివాదంలో చిక్కుకున్నారు. ప్రచారంలో భాగంగా దళితుడి ఇంటికి వెళ్లిన మంత్రి హోటల్ నుంచి తెచ్చుకున్న భోజనాన్ని లాగించేసి వెళ్లిపోయారు. మంత్రి సురేశ్ రాణా దళితుడు రజనీశ్ కుమార్ ఇంటికి వెళ్లారు. అక్కడ భోజనం చేసేందుకు ముందుగానే ఆహారం నుంచి నీళ్లు, ప్లేట్లు, గ్లాసుల వరకు అన్నింటినీ తమతోపాటు తీసుకెళ్లారు. వారి కుటుంబ సభ్యులతో కలిసి కూర్చోగానే కార్యకర్తలు విస్తర్లు వేసి వెంట తెచ్చుకున్న ఆహారాన్ని అందిరికీ వడ్డించారు. భోజనంలో పాలక్ పనీర్ నుంచి గులాబ్ జామూన్, సలాడ్, రైతా సహా అన్నీ ఉన్నాయి. దళిత కుటుంబ సభ్యులతో కలిసి హోటల్ నుంచి తెచ్చుకుని తింటున్న మంత్రి ఫొటోలు సోషల్ మీడియాకెక్కడంతో వైరల్ అయ్యాయి.

ఈ ఘటనపై రజనీశ్ మాట్లాడుతూ, తమ ఇంటికి మంత్రి వస్తారన్న విషయం వారు వచ్చే వరకు తమకు తెలియదన్నారు. ఉదయం 11 గంటల సమయంలో ఇంటికి వచ్చిన వారిని చూసి ఆశ్చర్యపోయానన్నారు. ఆహారాన్ని హోటల్ నుంచి తెచ్చుకు తినడంపై విమర్శలు రావడంతో మంత్రి కూడా స్పందించారు. తనతోపాటు చాలామంది రావడం వల్ల సరిపోదనే హోటల్ నుంచి తెప్పించాల్సి వచ్చిందన్నారు. తాను మాత్రం దళితులు వండిన ఆహారాన్నే తీసుకున్నానని వివరించారు.
Go Back to Shorts
BJP
Uttar Pradesh
Minister
Dalit Home

More Telugu News