Andhra Pradesh: ఏపీ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ

  • చంద్రబాబు అధ్యక్షతన సమావేశం
  • వేసవిలో పంటల నష్ట నివారణ చర్యలపై చర్చ
  • అగ్రిగోల్డ్‌, నిరుద్యోగ భృతిపై తీసుకోనున్న నిర్ణయాలు
  • కేంద్ర సర్కారు తీరుపై చర్చ
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ఇందులో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనున్నారు. ప్రధానంగా ఖరీఫ్‌ సీజన్‌ కోసం సన్నద్ధం కావడం, వేసవిలో పంటల నష్ట నివారణకు తీసుకోవలసిన చర్యలపై మంత్రులు చర్చిస్తున్నారు.

అలాగే, కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించుకోవాల్సిన ప్రయోజనాలు, ఏపీలో నిరుద్యోగులకు భృతి, కొత్త పీఆర్సీ, అగ్రిగోల్డ్‌ బాధితుల విషయం వంటి పలు అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. నిన్న ఏపీలోని పలు జిల్లాల్లో కురిసిన అకాల వర్షాలకు రైతులకు భారీగా నష్టం వచ్చిన నేపథ్యంలో ఆ విషయంపై కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. 
Andhra Pradesh
cabinet
Chandrababu

More Telugu News