omar abdullah: మోదీ సవాల్ ను రాహుల్ స్వీకరిస్తారని ఆశిస్తున్నా: ఒమర్ అబ్దుల్లా

  • పేపర్ చూడకుండా 15 నిమిషాలు ప్రసంగించాలంటూ రాహుల్ కు మోదీ సవాల్
  • మైనర్ బాలికలపై లైంగిక దాడులపై ప్రధాని 2 నిమిషాలు మాట్లాడాలని అబ్దుల్లా విన్నపం
  • బీజేపీ, పీడీపీ సర్కారు గందరగోళంగా వ్యవహరిస్తోంది
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలపై పేపర్ చూడకుండా 15 నిమిషాలు ప్రసంగించాలంటూ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి ప్రధాని మోదీ సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ... మోదీ సవాల్ ను రాహుల్ స్వీకరిస్తారని ఆశిస్తున్నానని చెప్పారు. మోదీని ఉద్దేశించి మాట్లాడుతూ, రెండు నిమిషాల పాటు మైనర్ బాలికలపై జరుగుతున్న లైంగిక దాడులపై ప్రధాని మోదీ మాట్లాడాలని కోరుతున్నామని అన్నారు. కథువాలో మైనర్ బాలికపై జరిగిన హత్యాచారం చాలా బాధాకరమని చెప్పారు. కథువా కేసుపై బీజేపీ, పీడీపీ సంకీర్ణ సర్కారు గందరగోళంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
omar abdullah
Rahul Gandhi
Narendra Modi
kathua

More Telugu News