groom: మద్యం మత్తులో స్నేహితుడు జరిపిన కాల్పుల్లో.. పెళ్లి పీటలపై వరుడి మృతి

  • యూపీలో ఘటన
  • పెద్ద శబ్దంతో మ్యూజిక్‌
  • ఎవరికీ వినపడని వైనం
  • పరారీలో నిందితుడు
మద్యం మత్తులో స్నేహితుడు జరిపిన కాల్పుల్లో పెళ్లి పీటలపై వరుడు మృతి చెందిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లఖీమ్‌పూర్‌ ఖేరీ జిల్లాలోని రామ్‌పూర్‌లో చోటుచేసుకుంది. పెళ్లి సందర్భంగా పెళ్లి కొడుకు, పెళ్లి కూతురి తరఫు బంధువులందరూ గడుపుతోన్న సమయంలో పెళ్లి కొడుకు ఒక్కసారిగా పెళ్లి పీటలపైనే కుప్పకూలిపోవడంతో విషాద ఛాయలు అలముకున్నాయి.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివరాలు తెలిపారు. పెళ్లి కుమారుడి పేరు సునీల్‌ వర్మ (25) అని, వివాహం సందర్భంగా పెద్ద శబ్దంతో మ్యూజిక్‌ పెట్టడంతో తుపాకీ పేలిన శబ్దం కూడా ఎవరికీ వినబడలేదని చెప్పారు. వరుడు కుప్పకూలిపోగా ఆయనను ఆసుపత్రికి తరలించారని అన్నారు. అయితే, అప్పటికే వరుడు మృతి చెందినట్టు వైద్యులు చెప్పారని తెలిపారు. తుపాకీ పేల్చిన యువకుడు పరారీలో ఉన్నాడని, నిందితుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టామని అన్నారు.                                                                                              
groom
Uttar Pradesh
gun

More Telugu News