Krishna District: కృష్ణా, గుంటూరు, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో భారీ వర్షం.. 11 మంది మృతి

  • ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం
  • ఇద్దరికి తీవ్రగాయాలు
  • కూలిపడ్డ చెట్లు.. పలుచోట్ల పిడుగుపాట్లు
కృష్ణా, గుంటూరు, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా కురుస్తోన్న అకాల వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కృష్ణా జిల్లాలో సహాయక చర్యల కోసం విజయవాడలో కంట్రోల్‌రూమ్‌ ఏర్పాటు చేశారు. పెనుగాలుల ధాటికి విజయవాడలోని పలు ప్రాంతాల్లో హోర్డింగ్‌లు విరిగిపడ్డాయి.

పలు చోట్ల చెట్లు కూలి పడ్డాయి. పిడుగు పాట్లు, చెట్లు విరిగిపడిన ఘటనల్లో మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ప్రజలు సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని అధికారులు సూచనలు చేస్తున్నారు. మూడు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయమేర్పడింది. కొన్ని చోట్ల వడగళ్ల వాన పడుతోంది.
Krishna District
Guntur District
Prakasam District

More Telugu News