భక్తులకు వడ్డించిన సాంబార్ అన్నంలో బల్లి.. 73 మందికి తీవ్ర అస్వస్థత
- తమిళనాడులోని కడలూరు జిల్లాలో ఘటన
- అమ్మాన్ ఆలయ వేడుకల్లో అపశ్రుతి
- దర్యాప్తు చేపట్టిన పోలీసులు
ఇది తిన్న కాసేపటికే భక్తులకు తల తిరగడంతోపాటు, వాంతులు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న ఆర్డీవో వెంటనే ఆలయం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా తమకు వడ్డించిన అన్నంలో చనిపోయిన బల్లి కనిపించిందని ఆర్డీవోకు భక్తులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.