Mahesh Babu: మహేశ్ 25వ మూవీకి సన్నాహాలు .. న్యూయార్క్ లో వంశీ పైడిపల్లి

  • వంశీ పైడిపల్లితో మహేశ్ బాబు 
  • కథానాయికగా పూజా హెగ్డే 
  • ముఖ్యమైన పాత్రలో అల్లరి నరేశ్
'భరత్ అనే నేను' సినిమా విజయవిహారం చేస్తుండటంతో, మహేశ్ బాబు ఫుల్ ఖుషీ అవుతున్నాడు. తన 25వ సినిమా కోసం త్వరలోనే ఆయన సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనుల్లోనే ఆయన బిజీగా వున్నాడు.

 కథ ప్రకారం ఈ సినిమా షూటింగ్ విదేశాల్లో ఎక్కువగా జరగనుంది. అందువలన వంశీ పైడిపల్లి లొకేషన్స్ వేటలో వున్నాడు. ఆయన .. ప్రముఖ సినిమాటోగ్రఫర్ కె.యు. మోహనన్ కలిసి లొకేషన్స్ ను సెర్చ్ చేస్తున్నారు. అలా వాళ్లు న్యూయార్క్ లో వున్నప్పటి ఫోటోను వంశీ పైడిపల్లి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. పూజా హెగ్డే కథానాయికగా నటించనున్న ఈ సినిమాలో, అల్లరి నరేశ్ ఒక కీలకమైన పాత్రను పోషించనున్నాడు.                                                                                                                                                             
Mahesh Babu
pooja hegde

More Telugu News