Tirumala: తిరుమలలో వడగళ్ల వాన.. తడుస్తూనే వెళ్లి, శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు

  • భారీ వర్షంతో తీవ్ర ఇబ్బందులకు గురైన భక్తులు
  • వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా వెంకన్నను దర్శించుకున్న చంద్రబాబు
  • తిరుపతిలో కూడా భారీ వర్షం
ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. భారీ వర్షంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇదే సమయంలో శ్రీవారి దర్శనానికి వచ్చారు. వర్షంలో తడుస్తూనే ఆయన ఆలయంలోకి వెళ్లి పూజాకార్యక్రమాలను నిర్వహించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి ఆయన వెంకన్నను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ కూడా ఉన్నారు. సాయంత్రం 5.30 గంటలకు ఆయన తిరుపతిలో జరగనున్న భారీ బహిరంగ సభకు బయల్దేరనున్నారు.

మరోవైపు తిరుపతిలో కూడా వర్షం కురిసింది. ఈదురు గాలుల ధాటికి సభా వేదిక వద్ద రేకులు ఎగరిపడ్డాయి. కొన్ని ఫ్లెక్సీలు ఎగిరిపోయాయి. ప్రస్తుతం వర్షం తెరిపి ఇవ్వడంతో, నిర్వాహకులు హుటాహుటిన ఏర్పాట్లను పూర్తి చేసే పనిలో పడ్డారు. ఈ సందర్భంగా మంత్రి అమర్ నాథ్ రెడ్డి మాట్లాడుతూ, వర్షం శుభసూచకమని... టీడీపీ ఏ కార్యక్రమం చేపట్టినా వర్షం పడటం ఆనవాయతీగా మారిందని చెప్పారు.
Tirumala
Tirupati
Chandrababu

More Telugu News