sudheer babu: 'సమ్మోహనం' మూవీ గురించి చిరూ ఏమన్నారంటే!

  • ఇంద్రగంటి మోహనకృష్ణతో 'సమ్మోహనం'
  • సుధీర్ బాబు సరసన అదితీరావు 
  • రేపు సాయంత్రం టీజర్ రిలీజ్        
ఇంద్రగంటి మోహనకృష్ణ పేరు వినగానే 'అష్టాచమ్మా' .. 'జెంటిల్ మేన్' .. 'అమీతుమీ' వంటి సినిమాలు గుర్తుకువస్తాయి. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'సమ్మోహనం' రెడీ అవుతోంది. సుధీర్ బాబు .. అదితీరావు నాయకానాయికలుగా నటించిన ఈ సినిమా నుంచి, రేపు సాయంత్రం 5:09 గంటలకు టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడారు. "సమ్మోహనం అనే టైటిల్ ఎంత ఆకర్షణీయంగా ఉందో .. అదే విధంగా ప్రేక్షకులను కూడా ఈ సినిమా ఆకర్షించుకుని వాళ్లను సమ్మోహితులను చేస్తుంది అనడంలో నాకైతే ఎలాంటి సందేహం లేదు. ఇదొక చక్కని లవ్ స్టోరీ .. సుధీర్ బాబుకి ఒక సూపర్ డూపర్ హిట్ ను ఈ సినిమా అందించాలని మనసారా కోరుకుంటున్నాను" అంటూ ఈ సినిమా టీమ్ కి చిరంజీవి శుభాకాంక్షలు అందజేశారు.       
sudheer babu
adithi rao

More Telugu News