ICOME TAX: పన్ను రిటర్నులు వేయని వారిపై ఆదాయపన్ను శాఖ ఫోకస్

  • పన్ను చెల్లించే ఆదాయం ఉండి రిటర్నులు వేయని వారు 65 లక్షల మంది
  • వీరికి ఈ మెయిల్స్, సందేశాల ద్వారా హెచ్చరికలు
  • పన్ను చెల్లించే వారి సంఖ్యను 9.3 కోట్లకు పెంచాలన్న లక్ష్యం

పన్ను చెల్లించే ఆదాయం ఉండి కూడా రిటర్నులు దాఖలు చేయని వారిపై ఆదాయపన్ను శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. పన్ను చెల్లించే వారి సంఖ్యను పెంచాలన్న లక్ష్యాన్ని నిర్ణయించుకున్న నేపథ్యంలో ఈ విషయమై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తోంది. డీమోనిటైజేషన్ అనంతరం పన్ను చెల్లించే వారి సంఖ్యను పెంచాలని కేంద్ర సర్కారు నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఆదాయపన్ను శాఖకు ఆదేశాలు కూడా వెళ్లాయి. దీంతో గత ఆర్థిక సంవత్సరంలో 1.5 కోట్ల మంది కొత్తగా పన్ను చెల్లింపుదారులు పెరిగారు. ఇదే ఉత్సాహంతో రిటర్నులు దాఖలు చేయని 65 లక్షల మందిపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది.

నిబంధనలను పాటించని వారిపై చర్యలు తీసుకోవడం ద్వారా పన్ను చెల్లించే వారి సంఖ్యను 9.3 కోట్లకు పెంచుకోవడమే దీని ఉద్దేశ్యంగా ఆ శాఖ వర్గాలు తెలిపాయి. 1.75 కోట్ల మంది ఆదాయపన్ను నిబంధనలను పాటించకపోవడంతో వారిని ఈ మెయిల్స్, ఎస్ఎంఎస్ ల ద్వారా సంప్రదించాలని నిర్ణయించింది.. ఇందులో 1.07 కోట్ల మంది స్వచ్చందంగానే రిటర్నులు ఫైల్ చేశారు. మిగిలిన వారు మిన్నకుండిపోయారు. దీంతో వారిని నేరుగా సంప్రదించనుంది.

More Telugu News